పెద్దపులి దాడిలో ఆవు మృతి..

కొడిమ్యాల, ఆంధ్రప్రభ ; మండలంలోని గంగారం తండాలో గత రెండు రోజులుగా పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. ఆదివారం ఆవు దూడపై దాడి చేసి చంపిన ఘటన తెలిసిందే.
ఈరోజు మరోసారి గ్రామ సమీపంలో సంచరించిన పెద్దపులి ఒక ఆవును వెంటాడి దాడి చేసి చంపింది. వరుసగా పశువులపై దాడులు జరుగుతుండటంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
పులి బారి నుంచి తమను, తమ పశువులను రక్షించాలని స్థానికులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. గ్రామంలో పులి సంచారం కారణంగా ప్రజలు భయంతో బయటకు రావడానికి కూడా జంకుతున్నారు.
