Coordinate | పోరుకు జనసేన సిద్ధం

Coordinate | పోరుకు జనసేన సిద్ధం

Coordinate | స్టేషన్ ఘన్‌పూర్‌, ఆంధ్రప్రభ : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని జనసేనపార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గాదె పృథ్వీ తెలిపారు. డివిజన్ కేంద్రంలో ఈ రోజు జనసైనికులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పార్టీ మున్సిపల్ ఎన్నికల ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ మాదిరెడ్డి దామో దర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడతూ మున్సి పాలిటీలో అన్నీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

గెలుపే లక్ష్యంగా జనసైనికులు బరిలో ఉంటారని పేర్కొన్నారు. స్థానికం గా జనసేన ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. విద్యావంతులైన యువత కు ప్రాధాన్యత ఇస్తూ బరిలో ఉంటామని తెలిపారు.మున్సిపల్ ఎన్ని కల్లో జండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి రహిత పాలన జరగాలంటే యువతను గెలిపించాలని ఓటర్లను కోరారు.

అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రతి ఇంటికి చేరేలా జనసైనికులు పని చేయాలని పిలుపునిచ్చారు. త్వరలో నియోజకవర్గంలోని విద్యా వంతులు, సామాజిక సేవకులు పార్టీలో చేరబోతునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రజాక్, కొంగరి రవితేజ, భాషబోయిన సమ్మ య్య, అక్కనపల్లి సాయి, మునిగాల పవన్, శెట్టి రాజేష్, వెంకట్, రాకేష్ తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply