Congress | గెలుపే లక్ష్యంగా..

Congress | గెలుపే లక్ష్యంగా..
Congress, ఆళ్లపల్లి/గుండాల, ఆంధ్రప్రభ : ఉమ్మడి గుండాల మండలాల్లోని కాంగ్రెస్ సర్పంచి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సుడిగాలి పర్యటనతో ప్రచారం నిర్వహించారు. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లోని వాంకుడోత్ బీకోజి గెలుపు కాంక్షిస్తూ, శెట్టిపల్లి, శంభునిగూడెం, లింగగూడెం, గుండాల, కాచనపల్లి, మర్కోడు, ఆళ్లపల్లి, పలు పంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా వాడవాడలా గ్రామగ్రామాన ప్రచారంతో బిజీ బిజీగా గడిపారు. ఆళ్లపల్లి అంబేద్కర్ నగర్లోని ప్రజల సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. మర్కోడు పంచాయతీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని.. ముఖ్య నేతలకు దిశనిర్దేశం చేశారు.
అనంతరం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజల అభివృద్ధికి దారితీసే కీలక అడుగని ప్రజలకు స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రచార యాత్రలో గ్రామస్థాయి సమస్యలు, అభివృద్ధి అవసరాలు, భవిష్యత్ ప్రణాళికలు వినిపిస్తూ, కాంట్రిబ్యూషన్ ప్రాముఖ్యత వివరించారు. గ్రామాల్లో అభివృద్ధి కొనసాగాలంటే.. స్ఫూర్తిదాయక స్థానిక నాయకత్వం అవసరమని గ్రామపంచాయతీలే గ్రామాల పురోగతికి పునాదని ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా ప్రజలందరికీ చేరాలంటే.. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల నాయకత్వం అత్యంత కీలకమని, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో గ్రామస్థాయి నాయకత్వం బలంగా ఉంటేనే భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకుపోతాయని గుర్తు చేశారు.
మన గ్రామ అభివృద్ధి కోసం, ప్రతి కుటుంబం మెరుగైన జీవన ప్రమాణాల కోసం, కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన సర్పంచ్ అభ్యర్థులందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పై ఉందన్నారు. గ్రామ ప్రజలందరూ కలిసి నిలబడితే ఉమ్మడి గుండాల ఆళ్లపల్లి మండలాల్లో అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుస్తుందని తెలిపారు. పంచాయతీ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలంటే.. శక్తివంతమైన నాయకత్వం అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో పిఎస్ఆర్ – పీవీఆర్ యువసేన కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ షేక్ ఖదీర్, యూత్ మండల అధ్యక్షులు దారఅశోక్, సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, అబ్దుల్ నభి, వాజీద్, కాసీం, బొంగు చంద్రశేఖర్, పల్లపు రాజేష్, మండలోజు కిరణ్, మండల కో ప్రచార కమిటీ అధ్యక్షులు వాసం శ్రీకాంత్, మహమ్మద్ అతాహర్, పడిగ సమ్మయ్య, ఎస్సీసెల్ శ్రీను, యూత్ అధ్యక్షులు శ్రీనాథ్, సాబీర్, మండల అధ్యక్షులు రామనరసయ్య, పాపారావు, తాళ్లపల్లి వెంకన్న, ప్రభాకర్, కృష్ణారి, సుధాకర్, బుర్రవెంకన్న, తులంముత్తిలింగం, సుతారి రమాదేవి, దొడ్డిరాము, కాంతు, రామారావు, చంద్రం, కేకేర్ల సునీత, పర్వీన్, భరత్ వీరభద్రాచారి, ఇనుముల ఇందు, పంచాయతీల అభ్యర్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
