Congress party | జీవన్‌రెడ్డితో మంత్రుల భేటీ…

Congress party | జీవన్‌రెడ్డితో మంత్రుల భేటీ…
Congress party | ఆంధ్రప్రభ, వెడ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పరిణామాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మారతారనే వార్తల నేపథ్యంలో హైకమాండ్ అప్రమత్తమైంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో మంత్రులు ఆయనను కలిసి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాలతో మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్, ఎమ్మెల్యే సత్యం జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆయనను పార్టీలోనే కొనసాగాలని ఒప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
