Congress | డీసీసీ అధ్యక్షుల రేసులో..

Congress | డీసీసీ అధ్యక్షుల రేసులో..

Congress, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ పునః నిర్మాణంలో భాగంగా తొలుత డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టనుంది. కృష్ణాజిల్లా డీసీసీ పదవికి ఆశావహులు పోటీపడుతున్నారు. ప్రధానంగా అవనిగడ్డకు చెందిన అందే శ్రీరామ్మూర్తి, పెడనకు చెందిన శొంఠి నాగరాజు రేసులో ముందు ఉన్నారు. డీసీసీ అధ్యక్షుల (Dcc president) నియామకం పై ఇటీవలే జిల్లాకు పరిశీలకునిగా వచ్చిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సంజయ్ దత్ మచిలీపట్నం వచ్చి అభిప్రాయసేకరణ చేపట్టి వెళ్లారు.

Leave a Reply