పెద్దపల్లి మున్సి పాలిటీపై కాంగ్రెస్ జెండా

పెద్దపల్లి మున్సి పాలిటీపై కాంగ్రెస్ జెండా

  • కోట్లరూపాయలతో పట్టణ అభివృద్ధి
  • బీఆర్ఎస్, బీజేపీలను తరిమి కొట్టండి
  • పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు

పెద్దపల్లి, ఆంధ్రప్రభ ; పెద్దపల్లి మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు స్పష్టం చేశారు. శనివారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి పట్టణంలోని 2 వ వార్డు లో పాస్తాం లక్ష్మి , 8వ వార్డులో ఎరుకల కల్పన, 9వ వార్డులో ఎండీ నాదీమ్ లకు మద్దతుగా ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అదేవిధంగా వివిధ కూడళ్లలో రోడ్డు షో నిర్వహించి రెండేళ్ల తమ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించారు. అనంతరం మాట్లాడుతూ
గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి పట్టణం అభివృద్ధికి నోచుకోలేదన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులు తీసుకవచ్చామన్నారు. పెద్దపల్లికి ఆర్టీసీ బస్ డిపోతో పాటు బైపాస్ రోడ్డు మంజూరు చేయించామన్నారు. ప్రధాన హదారులను అభివృద్ధి చేయడంతోపాటు వీధుల్లో సిమెంట్ రోడ్లు,మురికి కాలువలు నిర్మిస్తున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణపనులు జరుగుతున్నాయని, వాకర్స్ నడిచేందుకు వీలుగా మైదానాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. పట్టణంలోని అన్ని వాడలకు తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు.

మహిళలకు ఆర్టీసీబస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచితవిద్యుత్, రైతు లకు 2లక్షల వరకు రుణమాఫీచేసి 9 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమచేశామన్నారు. ఆరోగ్య శ్రీద్వారా 10లక్షలవరకు పెంచి ఉచితవైద్యాన్ని అందిస్తుమన్నారు. ఓట్ల సమయంలో వచ్చే బీఆర్ఎస్. బీజేపీ నాయకులను ప్రజలు తరిమి కొట్టాలన్నా రు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్నిచూసి ఈనెల 11న జరగనున్నఎన్నికల్లో చేతిగుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆయా వార్డుల ఇంచార్జ్లు, కార్యకర్తలతో పాటు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply