Competitions | నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలలో సీఎం

Competitions| తిరుపతి తుడా, (ఆంధ్రప్రభ) : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతిమణి నారా భువనేశ్వరీ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా సంక్రాంతి పాటల పోటీలను తిలకించారు. ఇవాళ చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లెలో జరిగిన సంక్రాంతి ఆటల పోటీల్లో భాగంగా విద్యార్థుల మ్యూజికల్ చైర్ ఆటలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

నందమూరి లెజెండ్ బాలకృష్ణ నటించిన సినిమా పాటలతో ఆ ప్రాంగణమంతా ఉత్సాహబరితంగా సాగింది. విద్యార్థులు పోటాపోటీగా మ్యూజికల్ చైర్ ఆటలో పాల్గొని పండగ వాతావరణంతో అలరించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, శాప్ చైర్మన్ అని మినీ రవి నాయుడు, రాష్ట్ర టీడీపీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, నారావారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
