• 2030 కామన్వెల్త్‌ క్రీడలకు బిడ్​.. ఆమోదించిన ఐఓసీ


ఆంధ్ర‌ప్ర‌భ స్పోర్ట్స్ డెస్క్ : ఒలింపిక్‌ తర్వాత అత్యంత ఆదరణ ఉన్న, ఎక్కువ దేశాలు బరిలో నిలిచే కామన్వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ (India) సిద్ధమవుతోంది. 2030 క్రీడలను గుజరాత్‌లో నిర్వహించేందుకు బిడ్‌ దాఖలు ఇప్పటికే వార్తలు వచ్చాయి. 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత ఒలింపిక్ సంఘం(Indian Olympic Association) బిడ్‌కు ఆమోదం తెలిపింది. ఆగస్టు 31 గడువుకు ముందే ప్రతిపాదనలను సమర్పించాలని ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో నిర్ణయించింది.

కామన్వెల్త్‌ క్రీడలకు 2010లో తొలిసారి భారత్‌ ఆతిథ్యం ఇచ్చింది. మరోసారి నిర్వహించాలనే ఆలోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, 2030లో జరిగే పోటీల కోసం ముమ్మర కసరత్తు చేస్తోంది. 2036 ఒలింపిక్ క్రీడల నిర్వహణకు ఆసక్తి కనబరుస్తున్న కేంద్రం, వాటిని కూడా గుజరాత్‌లోని అహ్మదాబాద్ (Ahmedabad, Gujarat)లోనే నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అంతకుముందే కామన్‌వెల్త్ క్రీడల(COMMONWEALTH GAMES) సమర్థ నిర్వహణ ద్వారా దేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పాలని యత్నిస్తోందని నిపుణులు అంటున్నారు.

Leave a Reply