CM Revanth | నాంప‌ల్లి కోర్టుకు హాజ‌రైన సీఎం రేవంత్

CM Revanth | నాంప‌ల్లి కోర్టుకు హాజ‌రైన సీఎం రేవంత్

CM Revanth | హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇవాళ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు (Nampally Representatives Special Court) కు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ, తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన మూడు కేసుల విచారణకు సీఎం హాజరయ్యారు.

ఎన్నికల ప్రచార సమయంలో నమోదైన ఈ కేసుల విచారణను కోర్టు ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది. కాగా ఎన్నికల ప్రచార సమయంలో తనపై నమోదైన కేసుల విషయంలో గతంలోనూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ప్రజాప్రతినిధుల కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈసారి కూడా ఆయన నేరుగా కోర్టుకు వచ్చి విచారణలో పాల్గొనడం గమనార్హం.

Leave a Reply