‎ప్రజా వేదిక భద్రతా ఏర్పాట్లు…

‎ప్రజా వేదిక భద్రతా ఏర్పాట్లు…

‎ఎస్పీ బి.ఉమామహేశ్వర్

బాపట్ల బ్యూరో, ఆంధ్రప్రభ : ‎రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భట్టిప్రోలు మండలంలోని సూరేపల్లి గ్రామంలో పర్యటిస్తున్న నేపథ్యంలో గురువారం జిల్లా  ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పూర్తి పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి  హెలికాప్టరు దిగేందుకు నిర్మించిన హెలిప్యాడ్ ప్రాంతాన్ని, అక్కడ తీసుకున్న భద్రత ఏర్పాట్లను, సిఎం కాన్వాయ్  ప్రయాణించు మార్గాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

హెలిప్యాడ్ నిర్మాణం చుట్టూ ఏర్పాటు చేసిన బ్యారికేడ్ల,  ప్రజా వేదిక ప్రాంగణంలోని గ్యాలరీలు, ప్రజలు సభా ప్రాంగణం లోపలకి వచ్చే పోయే మార్గలు, వి.ఐ.పి వాహనాల పార్కింగ్ స్ధలములు వద్ద బందోబస్తు, భద్రత ఏర్పాటులను సమీక్షించి అధికారులకు పలు సూచనలు తెలియచేసినారు. హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి స్వాగతం పలకడానికి విచ్చేసే వి.ఐ.పి ల వాహనాల పార్కింగ్, వారు వేచి ఉండుటకు చేసిన తగిన ఏర్పాట్లు, ముఖ్యమంత్రి వాహనశ్రేణి హెలిపాడ్ నుండి ప్రయాణించే మార్గం గ్రామాలలో నుండి వస్తున్నందున గ్రామస్థులకు, గ్రామంలోని వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటూ తగిన భద్రత ఏర్పాట్లను చెయ్యాలని, ప్రజా వేదిక ప్రాంగణం వద్దకు విచ్చేసే ప్రజలకు, కార్యకర్తల సమావేశానికి వచ్చే కార్యకర్తలకు, ఇతర ప్రజాప్రతినిధులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Leave a Reply