AP | కేంద్ర కేబినెట్ కీల‌క నిర్ణ‌యం..

  • ఆ మార్గంలో రైల్వే లైన్ డ‌బ్లింగ్ కు ఆమోదం

కేంద్ర మంత్రివర్గ సమావేశం ప‌లు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న తిరుపతి(ఏపీ)-కాట్పాడి(త‌మిళ‌నాడు) లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ నుంచి ఆమోదం లభించింది. తిరుపతి నుండి కాట్పాడి వరకు డబ్లింగ్ పనులకు రూ.1,332 కోట్ల వ్యయంతో కేంద్ర గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఆమోదం పొందిన తిరుపతి(ఏపీ)-కాట్పాడి(త‌మిళ‌నాడు) లైన్ డబ్లింగ్‌ ప్రాజెక్టు ద్వారా చిత్తూరు, తిరుపతి, వెల్లూరు జిల్లాలు ప్రయోజనం పొందుతాయని అశ్విని వైష్ణవ్ అన్నారు.

ఈ ప్రాజెక్టులో 17 మూజ‌ర్ వంతెనలు, 327 చిన్న వంతెనలు రానున్నాయని అశ్వినీ వైష్ణవ్ అన్నారు. అదేవిధంగా, 7 ఫ్లైఓవర్లు, 30 అండర్ పాస్ వంతెనలు రానున్నాయని తెలిపారు అన్నారు.

104 కి.మీ రోడ్డు మార్గానికి బదులుగా, ట్రాఫిక్‌ను రైల్వే మార్గానికి మళ్లిస్తామని.. తద్వారా 20 కోట్ల కిలోల కార్బన్‌డయాక్సైడ్‌ తగ్గుతుందని తెలిపారు. అదేవిధంగా 4 కోట్ల లీటర్ల డీజిల్‌ పొదుపు అవుతుందని వెల్లడించారు.

ఇక‌ ఈ ప్రాజెక్టు ద్వారా తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోట క్షేత్రాలకు లక్షల్లో భక్తులు తరలివస్తారని… తిరుపతి, వెల్లూరు ప్రాంతాల్లో వైద్య సంస్థలు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతానికి లబ్ది కలగనుందన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ రీజియన్‌కు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. అదే విధంగా ఎలక్ట్రానిక్స్‌, సిమెంట్‌, స్టీల్‌ తయారీ కంపెనీలకు కూడా లబ్ధి పొందుతాయని అశ్వినీ వైష్ణవ్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *