CCTV | లా స్టూడెంట్ ను కాల్చిచంపి… తనూ కాల్చుకొని…

CCTV | లా స్టూడెంట్ ను కాల్చిచంపి… తనూ కాల్చుకొని…
CCTV | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పంజాబ్ రాష్ట్రంలోని తరణ్ తరణ్ లో దారుణం చోటుచేసుకుంది. క్లాస్ రూమ్ లో తోటి విద్యార్థి గన్ తో లా స్టూడెంట్ ను కాల్చి చంపి…ఆ తర్వాత తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. లా స్టూడెంట్ ను కాల్చి, ఆ తర్వాత తనను తాను కాల్చుకున్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. నిందితుడు ప్రిన్స్ రాజ్ గా గుర్తించారు. మృతిచెందిన విద్యార్థిని సందీప్ కౌర్ గా గుర్తించారు. సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
