ఒకరి దుర్మరణం… మరో ఇద్దరికి గాయాలు
నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : సూర్యాపేట (Suryapet) జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో ఈ రోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదంలో మృతి చెందిన తోట తనుష్ కుమార్ (25) సొంతూరు జగ్గయ్యపేట. మృతదేహాన్ని మిర్యాలగూడ (Miryalaguda) ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు. గాయపడిన వారు చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదం జరిగిందిలా…
ఆంధ్రప్రదేశ్ ఎన్‌టీఆర్ జిల్లా (NTR District) జగ్గయ్యపేటకు చెందిన నిమ్మతోట తనుష్‌కుమార్, షేక్ బబ్లు, హరి కలసి కారులో బయలుదేరారు. హుజూర్ నగర్ నుంచి మిర్యాలగూడ వైపు మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో ప్రయాణిస్తుండగా తెల్లవారు జామున నాలుగున్నర గంటలకు నేరేడుచర్ల (Nereducharla) పట్టణంలోని హెచ్ పీ బంక్ సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఫల్టీ కొట్టింది. అలాగే కారులో మంటలు కూడా వ్యాపించాయి. ప్రమాదంలో నిమ్మతోట తనుష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. షేక్ బబ్లు, హరికి తీవ్ర గాయాలయ్యాయి.
