bus accident | ప్రాణాలతో బయటపడిన భార్య

bus accident | ప్రాణాలతో బయటపడిన భార్య

  • 14కి చేరిన మృతుల సంఖ్య

bus accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 14కి చేరగా, పలువురు గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ ప్రమాదంలో ఓ మహిళ తన భర్తతో పాటు ఐదు నెలల చిన్నారి కుమారుడిని కోల్పోవడం హృదయ విదారకంగా మారింది. స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకోవడంతో, ఆమె గుండెలు పగిలేలా రోదిస్తూ కనిపించింది.

ప్రమాదం కారణంగా అనేక కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో మునిగిపోయాయి. ఘటనపై అధికారులు విచారణ చేపట్టగా, ప్రమాదానికి గల కారణాలపై వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply