దేవరకొండలో బీఆర్ఎస్ సమావేశం
దేవరకొండ, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ(Congress party)కి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని నల్లగొండ జిల్లా బీఆర్ఎస్(BRS) అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్(Ramawat Ravindra Kumar) అన్నారు. ఈ రోజు దేవరకొండ పట్టణంలోని బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.
ఎన్నికల్లో హామీ ఇచ్చి ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని అన్నారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు వడితే రమేష్ నాయక్(Vadithe Ramesh Naik), నేనావత్ కిషన్ నాయక్, కేతావత్ బిలియా నాయక్, కంకణాల వెంకట్ రెడ్డి, వల్లపు రెడ్డి లోకసాని తిరుపతయ్య, రాజినేని వెంకటేశ్వరరావు, పార్టీల నాయకులు, బిఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.