brs l 6 వ వార్డు కౌన్సిలర్ గా గెలిపించండి…. ప్రజలకు రుణపడి ఉంటా..

brs l 6 వ వార్డు కౌన్సిలర్ గా గెలిపించండి…. ప్రజలకు రుణపడి ఉంటా..

సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తా
బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి దాసరి తిరుమలేష్

brs l మోత్కూర్ ,ఆంధ్రప్రభ; మోత్కూర్ మున్సిపాలిటీలో తనను కౌన్సిలర్ గా గెలిపిస్తే… ప్రజలకు నిరంతరం సేవకుడిగా ఉండి.. ప్రజాసేవ చేస్తానని ఎల్లవేళలా ప్రజలకు రుణపడి ఉంటానని ..6 వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి దాసరి తిరుమలేష్ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన తాను బిఆర్ఎస్ ఉద్యమ పార్టీలో చేరి ..ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సభ్యులుగా పనిచేసి , దళితవాడల్లో దళితుల హక్కుల కోసం గత కొన్నేళ్లుగా ప్రభుత్వ అధికారులతో కలిసి కృషి చేశానన్నారు. ఇప్పటికే రాజన్న గూడెం, ఇంద్ర నగర్ లో రేషన్ షాప్ సబ్ సెంటర్లు నెలకొల్పేందుకు అహర్నిశలు కృషి చేశానన్నారు. మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ హయాంలో 6 వ వార్డులో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 11 జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుపై అత్యధిక ఓట్లు వేసి కౌన్సిలర్ గా గెలిపిస్తే …వార్డులోని అన్నింటి సమస్యల పరిష్కారం చూపుతానని… మోత్కూరు మున్సిపాలిటీలో ప్రశ్నించే గొంతుకనవుతానని అభ్యర్థి తిరుమలేష్ విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply