BRS | ఓటు వేసి గెలిపించండి

BRS | ఓటు వేసి గెలిపించండి

BRS |భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన శెవ్వ అశోక్ ను గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. ఈ రోజు ఒకటో వార్డు లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారం తో ఒకటో వార్డు ను అభివృద్ధి చేస్తామని అన్నారు. శెవ్వ అశోక్ గుర్తు కారు గుర్తు అని కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. గత పది సంవత్సరాలుగా ఒకటో వార్డు లో వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన అభివృద్ధి కనిపిస్తుందని, కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన రెండు ఏండ్లలో చేసిన అభివృద్ధి ఏమి లేదని విమర్శించారు.

కాంగ్రెస్ కేవలం ఎన్నికలు రాగానే అభివృద్ధి రాగం అందుకుంటుందని విమర్శించారు. దొంగ 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధం అయ్యిందని కాంగ్రెస్ ను నమ్మొద్దని కోరారు. తొమ్మిదో వార్డు కౌన్సిలర్ గా శెవ్వ అశోక్ గెలవగానే కాలనీలో విద్యుత్ సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తానని తెలిపారు. కాలనీలో రోడ్లు, మురికి కాలువలు నిర్మాణం చేస్తానని, విద్యుత్ స్తంబాలు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply