చత్తీస్ గడ్ లోని నారాయణపూర్ లో నేడు జరిగిన ఎన్ కౌంటర్ లో 25 మంది నక్సలైట్లు హతమయ్యారు.. ప్రస్తుతం అక్కడ పోలీసులకు, నక్సలైట్ల కు మధ్య హోరాహోరిగా కాల్పులు కొనసాగుతున్నాయి.. గత రాత్రి నుంచి ఇక్కడ భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.. ఈ సందర్భంగా నేటి తెల్లవారుజామున నక్స లైట్ల నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయి. దీంతో భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించారు.. ప్రస్తుతానికి 25 మంది నక్సలైట్లు మరణించినట్లు అధికారులు దృవీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
Breaking News | చత్తీస్ గడ్ నారాయణపూర్ లో భారీ ఎన్ కౌంటర్ – 25 మంది నక్సలైట్లు మరణం
