తాగునీటి సమస్యకు చెక్…!

తాగునీటి సమస్యకు చెక్…!

  • ఎస్సీ కాలనీలోని అంగన్వాడీకి నల్ల కనెక్షన్
  • సమస్య తెలిసిన వెంటనే స్పందించిన 9వ వార్డు కౌన్సిలర్
  • చిన్నారుల కోసం నీటి సమస్యకు పరిష్కారం చూపిన సంపత్ రాజ్

స్టేషన్ ఘనపూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు గ్రామంలోని 9వ వార్డులోని ఎస్సీ కాలనీలో ఉన్న 3వ అంగన్వాడీ కేంద్రంలో కొంతకాలం గా తాగు నీటి సమస్య తీవ్రంగా ఉండేది. చిన్నారులు, అంగన్వాడీ సిబ్బంది రోజు వారీ కార్యకలాపాలు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండేవారు.

పలుమార్లు స్థానికులు సమస్యను తెలియ జేసినా పరిష్కారం కాలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న వార్డు కౌన్సిల ర్ సౌధరపల్లి సంపత్ రాజ్ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించేం దుకు ఆదివారం చర్యలు చేపట్టారు. అంగన్వాడీ కేంద్రానికి నల్ల కనెక్షన్ ఏర్పాటు చేయించడంతో పాటు నీటి నిల్వ కోసం సిమెంట్ రింగులు వేయించారు. తాగునీటి సౌకర్యం అందుబాటులోకి రావడంతో చిన్నా రులు, సిబ్బంది ఊరట కలిగింది.

ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం చూపుతా:

9వ వార్డులో ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తానని కౌన్సిలర్ సంపత్ రాజ్ తెలిపారు. వార్డులోని అంగన్వాడీ కేంద్ర పరిస రాలను పరిశీలించి భవిష్యత్తులో మరిన్ని అవసరమైన సదుపాయా లను కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చిన్నారుల ఆరో గ్యం, పరిశుభ్రత దృష్ట్యా తాగునీటి వసతి ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది, స్థానిక మహి ళలు, కాలనీ ప్రజలు కౌన్సిలర్ సంపత్ రాజ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపా రు. సమస్యపై తక్షణ స్పందన చూపి పరిష్కారం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ జవాన్ భాస్కుల యాద గిరి, వార్డ్ కాంగ్రెస్ నాయకులు భాస్కుల నాగరాజు, యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు ఐలపాక శ్రీనివాస్, భాస్కుల మహేష్ తది తరులు పాల్గొన్నారు.

Leave a Reply