Palle Porulo | పల్లె పోరులో..

Palle Porulo | పల్లె పోరులో..
- ఇదీ బీజేపీ పోటు
- తెల్లబోయిన గులాబీ దళం
- క్షేత్ర స్థాయిలో పుంజుకున్న కాషయం బలం
- బీఆర్ఎస్ ఖాతాలో 3502
- 688 పంచాయతీలను దక్కించుకున్న బీజేపీ
వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : పంచాయతీ ఎన్నికల్లో కమలం వికసించింది. క్షేత్ర స్థాయిలో బీజేపీ బలం పుంజుకుంటుందని చెప్పడానికి పంచాయతీ ఎన్నికలు ఒక నిదర్శనమయ్యాయి. పంచాయతీ ఎన్నికల్లో 5.41 శాతం(5.41 percent) పంచాయతీలు బీజేపీ దక్కించుకుంది. బీజేపీ బలం గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.
ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కు ఆశాజనకంగా ఫలితాలు వచ్చినప్పటికీ, ఆ బలం ఇంకా పుంజుకోవాల్సి ఉంది. రానున్న మండల పరిషత్ ఎన్నికల్లో(Mandal Parishad elections) ఆ పార్టీ సత్తా చూపించాలంటే ఇప్పటి నుంచే క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
అటు అధికార పార్టీ కాంగ్రెస్, ఇటు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బీజేపీతో తలపడి క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
పార్టీ బలబలాలు..
తెలంగాణలో 12,760 పంచాయతీలు. ఇందులో పలు కారణాల రీత్యా 12,705 పంచాయతీల(12,705 panchayats)కు ఎన్నికలు జరిగాయి. 3502 పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. సుమారు 27.56 శాతం పంచాయతీలు బీఆర్ఎస్ దక్కించుకున్నాయి.
లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవి చూసినా బీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికల్లో తన ప్రభావం చూపింది. తెలంగాణలో 688 పంచాయతీల్లో బీజేపీ మద్దతుదారులు విజయం సాధించారు. సుమారు 5.41 శాతం పంచాయతీలు మాత్రమే బీజేపీ దక్కించుకుంది. బీజేపీ క్షేత్ర స్థాయిలో బలం పుంజుకుందని చెప్పొచ్చు.
ఉనికి చాటుకున్న వామపక్షాలు
పంచాయతీ ఎన్నికల్లో వామపక్షాలు ఉనికిని చాటుకున్నాయి. సీపీఐ(CPI) పది జిల్లాలో 79 పంచాయతీలను కైవసం చేసుకున్నాయి. అలాగే సీపీఎం 13 జిల్లాలో 77 పంచాయతీల్లో ఆధిక్యత చాటుకుంది.
కమ్యూనిస్టులకు కంచుకోటలో అయిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఐ కి 66 పంచాయతీలు, సీపీఎంకు 39 పంచాయతీలు దక్కించుకున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా (Nalgonda district)లో 18 పంచాయతీలు చొప్పున సీపీఐ, సీపీఎం దక్కించుకున్నాయి.
