BJP l ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకనవుతా..

BJP l ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకనవుతా..

BJP, ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో బీజేపీ అభ్యర్థి బందెల సుభాష్ శుక్రవారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. వార్డు పరిధిలో ఉన్న సమస్యలను ప్రజలకు వివరిస్తూ వాటిని పరిష్కరించే అవకాశం తనకు కల్పించాలని, ఇప్పటి వరకు పాలకవర్గాలను ప్రశ్నించే గొంతుకగా ప్రజల పక్షాన నిలిచానని ఓటర్లకు గుర్తు చేశారు. స్థానిక రైల్వే గేట్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం తన వంతు పోరాటం చేశానని చెప్పారు. పార్టీ సీనియర్ నాయకులు చిరిగే శ్రీనివాస్, తోట మల్లయ్య, తోట వెంకటయ్య, పాశికంటి సోమయ్య, పత్తి రాములు, బందెల విష్ణుమూర్తి, బెజ్జం సోమరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply