బీజేపీ అభ్యర్థి శాంతి రెడ్డి ప్రచారం..

బీజేపీ అభ్యర్థి శాంతి రెడ్డి ప్రచారం..
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 3 వ వార్డులో బీజేపీ అభ్యర్థి చిలుగురి శాంతి రెడ్డి శనివారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఓటర్లకు వివరిస్తూ ప్రచారం జరిపారు. మండల బీజేపీ అధ్యక్షులు పూజారి కుమారస్వామి, నాయకులు అయిలి సందీప్ గౌడ్, కటకం రాజు, సుంకరి సృజన్ కుమార్, చిలుగురి నర్సిరెడ్డి, కళ్లెం రాజు గౌడ్, మైదం భాస్కర్, బైరి మహేందర్ గౌడ్ తో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
