birth2kill | ప్రాణాలు తీస్తున్నది వాళ్ళే

birth2kill | ప్రాణాలు తీస్తున్నది వాళ్ళే
birth2kill | పెరుగుతున్న దారుణ ఘటనలు
తల్లిదండ్రులే ఎందుకు ఇలా మారుతున్నారు?
కుటుంబ కలహాలు – మూల కారణమా?
ఆర్థిక ఒత్తిడి ప్రభావం
మానసిక స్థితి ప్రమాదకరం ఎలా?
సమాజం పాత్ర ఎంత కీలకం?
నిపుణులు చెప్పే హెచ్చరికలు
పరిష్కారం ఎక్కడ?
birth2kill | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఒక భయానక ధోరణి ఆందోళన కలిగిస్తోంది. కన్నవారే కాలయములుగా మారుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రాణం పోసిన చేతులే… ప్రాణాలు తీస్తున్న దారుణాలు సమాజాన్ని కలిచివేస్తున్నాయి.
నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చే తల్లి… కంటికి రెప్పలా కాపాడే తండ్రి… అదే పిల్లల ప్రాణాలను తామే తీసుకోవడం హృదయ విదారకం. క్షణికావేశం, అక్రమ సంబంధాలు, ఆర్థిక ఇబ్బందులు—కారణాలు ఏవైనా కావొచ్చు… కానీ పసిపిల్లల ప్రాణాలు పోతున్న వాస్తవం కలవరపెడుతోంది.

రక్షణ కవచంగా ఉండాల్సిన తల్లిదండ్రుల ప్రేమ, కొన్ని సందర్భాల్లో రాక్షసత్వంగా మారుతోంది. భద్రతగా ఉండాల్సిన ఒడిలోనే పిల్లలు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఒకచోట మద్యం మత్తులో భార్యాపిల్లల హత్య, మరోచోట వివాహేతర సంబంధం కారణంగా తల్లి ఆత్మహత్యకు ముందు పిల్లల హత్య, మరో ఘటనలో ఫ్లష్ ట్యాంక్‌లో శిశువు మృతదేహం బయటపడటం, ఇవి సమాజాన్ని షాక్‌కు గురిచేస్తున్నాయి.
ఒంటరితనం భరించలేక పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యలు, కుటుంబ కలహాల నేపథ్యంలో పిల్లలను బలితీసుకోవడం వంటి ఘటనలు ప్రమాదకర మానసిక పరిస్థితిని సూచిస్తున్నాయి.
భార్యాభర్తల మధ్య విభేదాలు, అనుమానాలు, ఆర్థిక ఒత్తిడులు, ఇవి కలిసి కుటుంబాలను సంక్షోభంలోకి నెడుతున్నాయి. కొందరు తమ కోపాన్ని పిల్లలపై చూపిస్తూ, తాము లేని తర్వాత పిల్లలు ఎలా బతుకుతారనే భయంతో వారినీ చంపాలనే ఆలోచనకు దిగుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడి కూడా ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నాయి. ముందుగా పిల్లలను చంపి, తర్వాత తాము ప్రాణాలు తీసుకోవడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి.
🟡 ఏం చేయాలి?
ఈ పరిస్థితుల్లో సమాజం, ప్రభుత్వం, కుటుంబ వ్యవస్థ, కలిసి స్పందించాల్సిన అవసరం ఉంది. పిల్లలకు రక్షణ కల్పించే విధానాలు బలోపేతం కావాలి.
గతంలో ఉన్న సంయుక్త కుటుంబ వ్యవస్థలో ఇలాంటి ఘటనలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఒంటరితనం పెరగడం సమస్యలను మరింత తీవ్రమవుతున్నాయి.
వివాహం తర్వాత వెంటనే పిల్లలను కనాలనే తొందరపాటు వద్దు. మానసికంగా, ఆర్థికంగా సిద్ధంగా ఉన్నారా? అనే విషయాన్ని ఆలోచించాలి. సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడుకోవడం అత్యంత ముఖ్యం.
నిపుణుల మాట

ఇది “ఎక్స్‌టెండెడ్ సూసైడ్ టెండెన్సీ” అనే మానసిక పరిస్థితి అని నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన మానసిక వేదనలో ఉన్నప్పుడు వ్యక్తి తనతో పాటు తన కుటుంబాన్ని కూడా మరణంలోకి లాగాలని భావిస్తాడు.
భావోద్వేగాల లోపం, సత్సంకల్పాల లేమి ఇవి కూడా ముఖ్య కారణాలుగా కనిపిస్తున్నాయి.
