BIG BREAKING | జోధ్‌పూర్‌లో ఘోర ప్రమాదం..

  • 18 మంది స్పాట్ డెడ్

రాజస్థాన్ : జోధ్‌పూర్ జిల్లాలోని ఫలోడి మండలం మటోడా ప్రాంతంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది.

ఈ ప్రమాదంలో 18 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, మృతులంతా జోధ్‌పూర్ జిల్లా మథానియా ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు.

ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply