గ్రామానికి వైకుంఠ రథం అందజేత

గ్రామానికి వైకుంఠ రథం అందజేత

బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి గ్రామానికి చెందిన పుర్మ కుటుంబ సభ్యులు సుమారు రూ.3 లక్షల వ్యయంతో వైకుంఠ రథాన్ని తయారు చేయించి గ్రామపంచాయతీకి అందజేశారు. ఈ రథాన్ని గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ వినియోగించుకునేలా అందుబాటులో ఉంచనున్నట్లు గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్‌కు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై బోయిని సౌజన్య మాట్లాడుతూ పుర్మ కుటుంబం చేసిన ఈ సేవ సామాజిక ఐక్యతకు, సేవాభావానికి నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దుమాల మహేష్, గ్రామ పంచాయితీ వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply