స్టార్ ప్లేయర్ ఎంట్రీ..!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆసియా కప్ 2025 (Asia Cup 2025) కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (Bangladesh Cricket Board) 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు లిట్టన్ దాస్ (Liton Das) కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. 2022లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ తర్వాత వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ నూరుల్ హసన్ (Nurul Hassan) తిరిగి జట్టులోకి వచ్చాడు. లిట్టన్ దాస్ కెప్టెన్సీలో బంగ్లాదేశ్ జట్టు శ్రీలంక, పాకిస్థాన్‌లపై టీ20 సిరీస్‌లు గెలిచి అద్భుత ప్రదర్శన చేసింది. ఈ జట్టులో స్టార్ పేసర్లు (Star Pacers) ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్ కూడా ఉన్నారు.
ఆసియా కప్‌కు ముందు, బంగ్లాదేశ్ నెదర్లాండ్స్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లు ఆగస్టు 30, సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 3 తేదీలలో సిల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. ఆసియా కప్ కోసం స్టాండ్‌బై ఆటగాళ్లుగా (Standby players) సౌమ్య సర్కార్, మెహెదీ హసన్ మీరాజ్, తన్వీర్ ఇస్లాం, హసన్ మహమూద్‌ను ఎంపిక చేశారు.
లిట్టన్ దాస్ కెప్టెన్సీలో అద్భుత ప్రదర్శన..
లిట్టన్ దాస్ కెప్టెన్సీలో బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకపై మొదటిసారిగా టీ20 సిరీస్ గెలిచింది. ఆ తర్వాత స్వదేశంలో పాకిస్థాన్‌పై కూడా టీ20 సిరీస్ గెలిచింది. ఈ జట్టులో స్టార్ పేసర్లు ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్ కూడా ఉన్నారు. సౌమ్య సర్కార్, మెహెదీ హసన్ మీరాజ్, తన్వీర్ ఇస్లాం, హసన్ మహమూద్‌ను ఆసియా కప్ కోసం స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఎంపిక చేశారు.
ఆసియా కప్, నెదర్లాండ్స్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు:
లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తంజిద్ హసన్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, సైఫ్ హసన్, తౌహిద్ హృదయ్, జేకర్ అలీ అనిక్, షమీమ్ హుస్సేన్, కాజీ నూరుల్ హసన్ సోహన్, మెహెదీ హసన్, రిషాద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తంజిమ్ హసన్ సాకిబ్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, మహమ్మద్ సైఫుద్దీన్.
స్టాండ్‌బై (ఆసియా కప్):
సౌమ్య సర్కార్, మెహెదీ హసన్ మీరాజ్, తన్వీర్ ఇస్లాం, హసన్ మహమూద్