బంద్‌ను విజయవంతం చేయాలి : బూడిద లింగయ్య యాదవ్

  • అన్ని పార్టీలు, కుల సంఘాలు సంఘీభావం

మునుగోడు, (ఆంధ్రప్రభ): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో, రేపు జరగబోయే బీసీ బంద్‌ను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు బూడిద లింగయ్య యాదవ్ పిలుపునిచ్చారు.

శుక్రవారం మండల కేంద్రంలోని మణి గార్డెన్‌లో జరిగిన సమావేశంలో బీసీ జాక్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొని బంద్‌కు సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా లింగయ్య యాదవ్ మాట్లాడుతూ, “స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అయినా బీసీల జీవితాల్లో పెద్ద మార్పు రాలేదు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం న్యాయమైన హక్కు. దానికి వ్యతిరేకంగా వ్యవహరించడం అసహ్యకరం,” అని వ్యాఖ్యానించారు.

వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ, బీసీలకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. బీసీల రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఈ పోరాటం కేవలం ఒక వర్గం కోసం కాదు, సమాన హక్కుల కోసం అని పేర్కొన్నారు.

ఈ సమావేశానికి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూడిద మల్లికార్జున యాదవ్, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు గుంటోజు వెంకటాచారి ఆధ్వర్యం వహించారు. అలాగే బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ, బీజేపీ మండల అధ్యక్షుడు పెంబళ్ళ జానయ్య, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మందుల సత్యం, సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో బొలుగూరి నరసింహ, మిర్యాల వెంకటేశ్వర్లు, జిట్టగోని యాదగిరి, తీర్పారి వెంకటేశ్వర్లు, గురిజా రామచంద్రం, మారగోని అంజయ్య గౌడ్, సాగర్ల లింగస్వామి, వేముల లింగస్వామి, మాలిగ యాదయ్య, ఈదులకంటి కైలాస్, ఏరుకొండ శ్రీను, నేరటి మల్లేష్, తాటికొండ సైదులు, బండారు శ్రీనివాస్, ఈర్ల లింగస్వామి, అనంతుల సాయి పవన్, బొల్లం సైదులు, కందుల లింగస్వామి, మాధగోని నరేందర్, ఉప్పునూతల శ్రీశైలం, నకెరికంటి యాదయ్య, నవీన్, శరత్ బాబు, వెంకట్ తదితరులు హాజరయ్యారు.

Leave a Reply