బాబాపూర్ లో వరకట్నం నిషేధం

బాబాపూర్ లో వరకట్నం నిషేధం

ఇంటింటికి తోచినంత సహాయం వధువుకు అందజేత

ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని బాబా పూర్ పంచాయతీలో వరకట్నం కానుకలు నిషేధిస్తూ గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్టు బాబాపూర్ సర్పంచ్ మెస్రం మెస్రం గంగాదేవి ప్రభాకర్ తెలిపారు. పంచాయతీలోని ముసలపాడు లో ఇంటింటికి 200 చొప్పున జమ చేసి ఆత్రం అంబాజీరావు కుమార్తె జయశ్రీ వధువు పెళ్లికి ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా పటేల్చిక్రం శివకుమార్ పటేల్ మాట్లాడుతూ.. గ్రామంలో ఆహేరాలు, డబ్బాలు కానుకలు పెళ్ళిలో నిషేధం చేశామన్నారు. గ్రామస్తులంతా ఇంటింటికి తోచినంత సహాయం చేసిన డబ్బులను వధువుకు అందించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మెస్రం గంగాదేవి ప్రభాకర్, దేవరి ఆత్రం పాండురంగ్, గ్రామ పెద్దలు మాడవి నాగోరావ్, మాధవ్ రావు, మనోహర్ దేవరావు రాజు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply