Balkonda | జాతరకు ముస్తాబైన చిలుకల చిన్నమ్మ ఆలయం

Balkonda | జాతరకు ముస్తాబైన చిలుకల చిన్నమ్మ ఆలయం
Balkonda | బాల్కొండ, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని శ్రీరాంపూర్ లోని చిలుకల చిన్నమ్మ ఆలయం జాతరకు ముస్తాబైంది. రేపు (ఆదివారం) జరిగే జాతరకు ఆలయాభివృద్ధి కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చిలకల చిన్నమ్మ ఆలయాన్ని సర్వంగా సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. జాతర సందర్భంగా అమ్మవారికి పవిత్ర గంగాజలాలను ఊరేగింపుగా తీసుకొచ్చి అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామంలో అమ్మవారిని ఊరేగించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు వారు వివరించారు. మేకలు,గొర్రెలు కోళ్లను బలిచ్చి భక్తులు తమ మొక్కులను చెల్లించుకుంటారు. భక్తుల సౌకర్యార్థం ఆలయాభివృద్ధి కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాటను పూర్తి చేశారు. ప్రతి ఏటా మాఘమాస అమావాస్య రోజున జాతరను ఘనంగా నిర్వహిస్తారు.
