Avarics : బొక్కుడే..బొక్కుడు

Avarics : బొక్కుడే..బొక్కుడు
ఆ బడిలో.. కిచెన్ ఉంది..
గార్డెన్ లేదు..
నిధులు ఖర్చు మామూలే
ఇదీ అయ్యవార్ల అవారిక్స్
— –ఇవి పీఎంశ్రీ నిథులకు
అవినీతి బొరియలు
(ఆంధ్రప్రభ , అర్ధవీడు) నేను ఆకలితో వున్న వ్యక్తిని చూశాను. నేను అతనికి చేపలు పట్టడం నేర్పాను.
” I saw a hungry man , I taught him, how to fish “
అనే ట్యాగ్ లైన్ లో.. అర్థవీడు హైస్కూలులోని స్కూల్ న్యూట్రిషన్ గార్డెన్ (School Nutrition Garden) కార్యక్రమ మార్గదర్శకాల పత్రం ప్రారంభవుతోంది. విద్యార్థుల జీవిత కాలపు నైపుణ్యాల సాధనకు ఆ పంక్తుల అంతరార్ధం పునాది అని అది నొక్కి వక్కాణించింది.
ప్రభుత్వ పాఠశాల విద్యలో ఇంతటి కీలక ప్రాధాన్యత గల ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ అక్కున చేర్చుకుందా? లేక అంకురంలోనే తొలిచేసిందా? చిన్నారులకు చేపలు పట్టడం ( Taught Fishing) నేర్పిందా?లేదా ప్రజాధనాన్ని బొక్కడంలో (Avarics) తామేమి తక్కువ కాదని ప్రభోదం (Admonition) చేసిందా?
అనే జవాబుదారి ప్రశ్నలకు విద్యా శాఖ వద్ద సగర్వమైన స్పందన ఉండదని చెబుతుంది, ప్రకాశం జిల్లా అర్ధవీడులోని పీఎంశ్రీ ( ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా ) పాఠశాల.
Avarics : అయ్యవార్లంటే..

ప్రకాశం జిల్లా అర్థవీడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ( జి హెచ్ఎస్ ) పీఎంశ్రీ(PMSRI) పథకంలో ఎంపికయిన విషయం తెలిసిందే. సమగ్ర విద్యా బోధన సాధనకు దీనిని ఆదర్శంగా చూపాలనేది ఆ ఎంపిక ఉద్దేశం. ఇందులో కీలకమైన ప్రాతిపదికల్లో ఒకటి కిచెన్ గార్డెన్ (Kitchen Garden). దీనికే మరో పేరు స్కూల్ న్యూట్రిషన్ గార్డెన్.
స్వయంగా విద్యార్థులతో తోట నిర్వహణ చేయించడం ద్వారా ప్రకృతితో ప్రత్యక్ష (Natural Relations) సంబంధాన్ని ఏర్పరచడం ఒక లక్ష్యం. తాజాగా పండించిన కూరగాయల వినియోగం ద్వారా పోషకాహార, సూక్ష్మ పోషకాల లోపాన్ని ( Nutrition Deficiency) విద్యార్థుల్లో పరిష్కరించాలని మరో లక్ష్యం. కూరగాయల్లో దాగిన పోష్కాంశాలను ప్రత్యక్షంగా అనుభవించడం ద్వారా అనారోగ్యానికి గురి చేసే జంక్ ఫుడ్ ప్రభావాలపై జ్ఞానాన్ని ఇవ్వడం ఇంకో లక్ష్యం.
Avarics : లెక్క ఘనం..పని శూన్యం

శాస్త్రీయమైన ఆలోచన, అవగాహన, జ్ఞాపకశక్తి, నేర్చుకోవాలనే ప్రేరణ, సమస్యలను పరిష్కరించడం, తర్కించడం, భాషను ఉపయోగించడం వంటి మానసిక ప్రక్రియలను అభిజ్ఞ సామర్ధ్యలు అంటారు.
బాగా తినే పిల్లలు అభిజ్ఞ సామర్థ్యలు బాగా నేర్చుకోగలరని కిచెన్ గార్డెన్ మార్గదర్శకాలు ఉటంకించాయి. దీనినే విద్యకు ప్రత్యక్ష రూపం అని అభివర్ణించింది. ఈ సాధనా ప్రక్రియ జీవనోపాధికి (Livelyhood) , స్వయంసమృద్ధికి (Self Sufficiency) బంగారు బాటలు వేస్తుందని సూత్రీకరించింది. ఈ లక్ష్య సాధనకు కేటాయించిన నిధుల్లో కేవలం 36 శాతం (36 %) ఖర్చు చేసి నూరు శాతం (100%) లెక్క చూపారు.
Avarics : బొక్కుడే బొక్కుడు
జి హెచ్ ఎస్ లో కిచెన్ గార్డెన్ నిర్మాణానికి (Construction Ammount) చూపిన లెక్క రూ. 1.25 లక్షలు. ( ₹1.25 Lakh) ప్రభుత్వ విద్యా ప్రియుల అంచనా ఖర్చు విలువ కేవలం ₹. 46,150 . అంటే 36.92 శాతం మాత్రమే. నేల తవ్వినందుకు రూ. 25 వేలు ఖర్చు చూపారు. కాని నేల చదునుకు ఎలాంటి తవ్వకం చేయలేదని పరిశీలకుల బలమైన అభిప్రాయం.
Avarics : బొక్కుడే బొక్కుడు

కిచెన్ గార్డెన్ మెటీరియల్, (Chain Link) ఇనుప కంచె కోసం ₹. 72,340 లు లెక్క చూపారు. పరిశీలకుల అంచనా ప్రకారం ₹ 31750 మాత్రమే. కిచెన్ గార్డెన్ కంచె నిర్మాణానికి ఏడు అడుగుల (7 Ft Height) ఎత్తు గల 28 ఇనుప పైపులు (Iron Pipes) ఉపయోగించారు. వీటి బరువు 140 కేజీలు. కేజీ ధర రూ. 65లు. ఈ లెక్కన బిగించిన పైపుల విలువ ₹. 9,100. బిగించిన ఇనుప కంచె (మెస్ ) బరువు 155 కేజీలు. కేజీ ధర ₹. 90లు. మొత్తం ఖర్చు ₹. 13950.
గోడ నిర్మాణానికి వాడిన 310 సిమెంట్ ఇటుకల ఖరీదు ₹. 8700. ఇవే కాదు కూలి ఖర్చులు తేడానే. కూలీ ఖర్చులు ₹. 27,660 లెక్క చూపారు. పరిశీలకుల ప్రకారం కేవలం ₹. 4400. ఈ లెక్కలు ఇలా ఉంటే భూమి చదునుకు, గోడ నిర్మాణానికి ఉపాధి హామీ పధకం కింద చేయాలని మార్గదర్శకాల్లో సూచించారు. ఈ సూచనను పాటించినట్లు లేదు.
Avarics : బొక్కుడే బొక్కుడు

స్థలం వున్నా చోట విశాలమైన తోట నిర్మాణం చేయాల్లన్నది మరో సూచన. పాఠశాలకు వున్నా స్థలానికి, జరిగిన గార్డెన్ అరకొర నిర్మాణానికి పొంతన లేదు. దీనిని బట్టి, ఈ విశ్లేషణ ఆధారంగా విద్యా శాఖ పిల్లలకు చేపలు పట్టడం నేర్పిందా? ప్రజాధనం బొక్కడం ప్రభోధించిందా? అనేది విస్పష్టం.
CLICK HERE TO READ Pediatric Pedlers | శిశువుల విక్రయ ముఠా అరెస్ట్
