మాజీ కేంద్ర మంత్రి కావూరికి అవనిగడ్డ ఎమ్మెల్యే నివాళి..

మాజీ కేంద్ర మంత్రి కావూరికి అవనిగడ్డ ఎమ్మెల్యే నివాళి..
అవనిగడ్డ, ఆంధ్రప్రభ: మాజీ కేంద్ర మంత్రి, పూర్వపు మచిలీపట్టణం లోక్ సభ సభ్యులు కావూరి సాంబశివరావుకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నివాళులు అర్పించారు. గురువారం ఉదయం హైదరాబాదులోని కావూరి స్వగృహంలో సాంబశివరావు పార్ధివదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కావూరి మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కావూరితో తమ కుటుంబానికి సుదీర్ఘ కాలంగా ఉన్న అనుబంధం స్మరించుకున్నారు.

