ఆకలి తీర్చడమే లక్ష్యం..

ఆకలి తీర్చడమే లక్ష్యం..

  • 387వ వారానికి చేరిన ‘జనహిత’ అన్నదానం*

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద ‘జనహిత సేవా సమితి’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం సోమవారంతో విజయవంతంగా 387వ వారానికి చేరుకుంది. దాసి రమాదేవి 12వ వర్ధంతిని పురస్కరించుకుని, ఆమె జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు దాసి ఉమాదేవి-సదానందం దంపతులు ఈ వారం అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమారు 180 మందికి అన్నదానం నిర్వహించారు.

ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ.. 2021 ఏప్రిల్ 13న ఉగాది పర్వదినాన ప్రారంభమైన ఈ అన్నదాన కార్యక్రమం దాతల సహకారంతో మూడేళ్లుగా నిర్విరామంగా కొనసాగుతోందని తెలిపారు. ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చడంలోనే అసలైన తృప్తి ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు దాసి సతీష్, చిప్ప అజయ్‌లతో పాటు జనహిత సేవాసమితి ప్రతినిధులు గొడిసెల శేఖర్, భీమిని కనకయ్య, నిచ్చకోల గురుస్వామి, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply