గోరు వెచ్చగా.. గోల్డు రూటు

ఈరోజు బంగారం ధర ఎంతంటే

ఏపీలో పెరిగింది

తెలంగాణ  మెట్టు దిగింది

( ఆంధ్రప్రభ, బిజినెస్​ డెస్క్)​

గత పది రోజులు స్థిరంగా .. బంగారం ప్రియులతో దోబూచులాడిన జ్యూయలరీ మార్కెట్​ లో … దసరా జోష్​ పెరిగింది. అకస్మాత్తుగా బంగారం ధర లో మార్పు వచ్చింది. గోరు వెచ్చగా వినియోగదారుల్లో వేడిని పెంచుతోంది. ఒక రకంగా   ఏపీలో సోమవారం నుంచే  బులియన్​ మార్కెట్​ ఊపందుకుంది.   సోమవారం సాయంత్రానికి ఒక్క గ్రామ్​ బంగారం  ధర    ₹60 ల నుంచి ₹ -63లు  పెరిగాయి. చివరి 10 రోజుల్లో  సెప్టెంబర్​ 21 నుంచి 30వ తేదీ వరకూ పరిశీలిస్తే 10 గ్రాముల  24 క్యారెట్ల బంగారం ధర రూ.4,260లు పెరిగింది. సెప్టెంబర్​ 21 న రూ.1,12,150లు పలికిన 10 గ్రాముల  24 క్యారెట్ల బంగారం ఈ రోజు 1,16,410లకు చేరింది.

-ఇక  తెలంగాణలో  బంగారం ధర ఆచీ తూచీ అడుగులు వేస్తోంది. సోమవారం గ్రాముకు రూ.141లు పెరిగితే.. మంగళవారం ఉదయానికి రూ.48లు తగ్గింది. ఏపీలోని ప్రస్తుత ధరను బేరీజు వేసుకుని .. మధ్యతరగతి వినిమోగదారులను ఆకర్షించే వ్యూహం కావొచ్చు అని విశ్లేషకుల అంచనా. 10 గ్రాముల   24 క్యారెట్ల బంగారం ధర సోమవారం 1,16,890లు పలికింది. మంగళవారం ఉదయానికి రూ.1,16,410లకు చేరింది. అంటే రూ.480లు తగ్గింది. సోమవారం సాయంత్రం 6.00 గంటలకు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర  1,16,400లు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,06,670 లు, 18 క్యారెట్ల బంగారం  గ్రాముల ధర రూ.87,300లకు చేరింది. తాజాగా మంగళవారం ఉదయం 9.30 గంటలకు బులియన్​ మార్కెట్​ ధర ప్రకారం ఏపీలో 10 గ్రాముల బంగారం ధర రూ.10లు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,16,400లు, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,06,680లు, 18 క్యారెట్ల బంగారం  గ్రాముల ధర రూ.87,310 లకు చేరింది.

ఇక వెండి ధరలను పరిశీలిస్తే  ఏపీ, తెలంగాణలో  ఒక్క రోజులో కిలోధర రూ.1000లు పెరిగింది. రూ.1,59,000ల నుంచి రూ.1,60,000లకు పెరిగింది. గడచిన పదిరోజుల్లో రూ.1,45,000ల నుంచి రూ.1,60,000లకు చేరింది.

నగరం                                   24 క్యారెట్స్​                         22 క్యారెట్స్​                         18 క్యారెట్స్​

హైదరాబాద్​                         రూ.11,641లు      రూ.10,671లు      రూ.8,731లు

వరంగల్​                               రూ.11,689లు      రూ.10,715లు      రూ.8,767లు

విజయవాడ                         రూ.11,641లు      రూ.10.671లు      రూ.8,731లు  

గుంటూరు                            రూ.11,641లు      రూ.10,671లు      రూ.8,731లు

విశాఖపట్నం                       రూ.11,641లు      రూ.10,671లు      రూ.8,731లు

చెన్నై                                       రూ.11,674లు      రూ.10,701లు      రూ.8,861లు

కోల్​కత్త                                 రూ.11,641లు      రూ.10,671లు      రూ.8,731లు  

ముంబై                                   రూ.11,641లు      రూ.10,671లు      రూ.8,731లు

ఢిల్లీ                                         రూ.11,661లు      రూ.10,681లు      రూ.8,741లు

బెంగళూరు                          రూ.11,641లు      రూ.10,671లు      రూ.8,731లు

కేరళ                                      రూ.11,641లు      రూ.10,671లు      రూ.8,731లు

అహ్మదబాద్​                                     రూ.11,641లు      రూ.10,671లు      రూ.8,736లు వడోదర                                 రూ.11,641లు      రూ.10,671లు      రూ.8,736లు

Leave a Reply