AP | సిద్ధి వినాయ‌క స‌న్నిధిలో జ‌న‌సేన‌ ఆవిర్భావ స‌భ పోస్ట‌ర్ విడుద‌ల‌

పిఠాపురంలో ఈ నెల 14న స‌భ‌
కాణిపాకంలో న‌టుడు పృథ్వీ
ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు
స‌భ ఏర్పాట్ల వివ‌రాలు తెలిపిన న‌టుడు

కాణిపాకం – ఈనెల పిఠాపురంలో జ‌న‌సేన 12 ఆవిర్భావ సభ సందర్భంగా కాణిపాక వినాయక స్వామి దేవస్థానంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు ఆ పార్టీ సీనియ‌ర్ నేత , న‌టుడు పృథ్వీ. అలాగే స‌భ పోస్ట‌ర్ ను సిద్ధి వినాయ‌క స‌న్నిధిలో ఆవిష్క‌రించారు.. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ, పిఠాపురం సభ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయ‌న్నారు. దేశం లో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు . పిఠాపురం సభలో దేశ ప్రజలకు సనాతన ధర్మం గురించి, జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నార‌ని వెల్ల‌డించారు.

ఈ కార్యక్రమంలో, జనసేన పార్టీకి చెందిన రాయలసీమ జోన్ ఎలక్షన్ క్యాంపింగ్ కమిటీ సభ్యుడు పూల ప్రభాకర్ , జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మట్టపల్లి మునిరాజులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, రాజ్ కుమార్, యోగరాజ్, జనసేన నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *