న్యూఢిల్లీ. (ఆంధ్రప్రభ బ్యూరో) : కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మిగనూరు ఎం.ఎల్.ఏ బీ వి జయ నాగేశ్వర రెడ్దిలు సమావేశామయ్యారు. బుధవారం నాడు ఢిల్లీలోని కేంద్ర మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. కర్నూలు నుంచి ఎమ్మిగనూరు, ఆదోని మీదుగా హాస్పెట్ తోర్నగల్ వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలంటూ వినతి పత్రం అందజేశారు.
ఈ రైల్వే లైన్ ఏర్పాటు చేయడం ద్వారా పరిశ్రమల విస్తరణ, కొత్త పెట్టుబడుల ఆకర్షణ, ప్రాంతీయ ఆర్ధికాభివృద్ధి ఉతం లభిస్తుందని వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్ష , పరోక్ష ఉపాధి, ప్రాంతీయ నిరుద్యోగితను తగ్గించడం తో పాటు స్థానికుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని వెల్లడించారు.
అలాగే ఎమ్మిగనూరు, ఆదోని చుట్టూ పరిసర ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య, విద్య, రవాణ, అత్యవసర సేవలు విరివిరిగా అందుబాటులోకి వస్తాయని వారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి వివరించారు.
