AP | శ్రీవారి సేవలో వైసీపీ నేతలు..

AP | శ్రీవారి సేవలో వైసీపీ నేతలు..

AP | విజయవాడ, ఆంధ్రప్రభ : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దర్శించుకున్నారు. ముక్కుంటి ఏకాదశి సందర్భంగా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. వై యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తలశీల రఘురామ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, వెస్ట్ ఇంఛార్జ్ వెలంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ ఇంచార్జ్ మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ శ్రీవారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.

Leave a Reply