AP | ఏలూరులో పెద్దపులి సంచారం

AP | ఏలూరులో పెద్దపులి సంచారం
AP | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచరిస్తుండటంతో భక్తులతో పాటు పరిసర ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏలూరు జిల్లా గుబ్బలలోని స్థానిక మంగమ్మ గుడి వెళ్లే అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది. రాత్రి సమయంలో గుడికి సమీపంలో పెద్ద పెద్ద అరుపులతో పులి సంచరించడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో పెద్దపులి పాదముద్రలను గుర్తించారు. దీంతో పెద్దపులి సంచరిస్తున్నట్లు నిర్ధారించారు. అప్రమత్తత జారీ చేశారు. పరిసర ప్రాంత ప్రజలు రాత్రి సమయంలో ఒంటరిగా బయటకు రావొద్దని తెలిపారు. గుడికి వెళ్లే భక్తులు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
