ఫోన్ లో పోలీసులతో మాట్లాడిన హోం మంత్రి..

ఫోన్ లో పోలీసులతో మాట్లాడిన హోం మంత్రి..

చల్లపల్లి – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీసుస్టేషన్ లో పేలుడు ఘటనలో గాయాలైన పోలీసులతో ఫోన్లో హోం మంత్రి అనిత మాట్లాడారు. గాయాలైన పోలీసులకు హోం మంత్రి ధైర్యం చెప్పారు. ఎప్పటికప్పుడు పోలీసులు యొక్క ఆరోగ్య పరిస్థితులపై అడిగి తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. పోలీసులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

Leave a Reply