శుశిక గోధుమ పంటపై క్షేత్ర ప్రదర్శన

శుశిక గోధుమ పంటపై క్షేత్ర ప్రదర్శన
తాడ్వాయి, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కనకల్ గ్రామంలో గోధుమ పంటపై క్షేత్ర ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఈగల్ సీడ్స్ అండ్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన రైతు ఆకిటి ప్రతాప్ రెడ్డి వారి పొలంలో ఈ ఫీల్డ్ విజిట్ జరిగింది.ఈ క్షేత్ర ప్రదర్శనకు దాదాపు 60 నుంచి 70 మంది రైతులు హాజరై పంట పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా టెర్రిటరీ సేల్స్ మేనేజర్ ఊరడే సతీష్ మాట్లాడుతూ, గత 44 సంవత్సరాలుగా ఈగల్ సీడ్స్ సంస్థ సోయాబిన్, మొక్కజొన్న, వరి, గోధుమలు మరియు కూరగాయల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచుతూ విశ్వసనీయతను సంపాదించిందన్నారు.
ప్రస్తుతం ప్రదర్శనలో ఉన్న గోధుమ రకం “శుశిక”135 , మంచి కంకి పొడవు, అధిక గింజల శాతం కలిగి ఉండటంతో పాటు రసం పీల్చే పురుగులను తట్టుకునే శక్తి కలిగి ఉందని తెలిపారు. అలాగే ఈ రకం తెగుళ్లకు నిరోధకత కలిగి ఉండి మంచి దిగుబడిని ఇస్తుందని వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ , స్థానిక డీలర్లు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సేల్స్ ఆఫీసర్ సాయి కిరణ్ సమన్వయం చేశారు.రైతులు ఈ క్షేత్ర ప్రదర్శన ద్వారా గోధుమ పంటలో మెరుగైన పద్ధతులు మరియు ఉత్తమ రకాలపై అవగాహన పెంపొందించుకున్నారు.
