స్థానికులకు మంచినీటి కుండలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

స్థానికులకు మంచినీటి కుండలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

రాజకీయాలతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం..
13వ డివిజన్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్..
నిరుపేద కుటుంబానికి రిక్షాబండిని, స్థానికులకు మంచినీటి కుండలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్

ఆంధ్రప్రభ పటమట : రాజకీయాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ యేనని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. రాజకీయాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం వల్లనే ప్రజాభిమానం పొంది 44 సంవత్సరాలుగా ఎన్నికల్లో విజయాలను సాధిస్తూ ప్రజల్లో సుస్థిరంగా ఉన్నామని అన్నారు. ఆదివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ జేడీ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాలివాహన సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంచి నీటి కుండల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆ తదుపి డివిజన్ లోని నిరుపేద కుటుంబానికి చెందిన ఎలగంటి సత్యనారాయణకు జీవనోపాధి నిమిత్తం రిక్షా బండిని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల సారధి అయిన నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ ప్రారంభించిన సంక్షేమ పథకాలు దేశం మొత్తానికి ఆదర్శమని అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకొంటున్నారని తెలిపారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వేసవిలో ప్రజల దాహర్తిని తీర్చేందుకు చల్లటి నీటి కోసం కుండల పంపిణీతో పాటుగా పేద కుటుంబానికి అండగా ఆర్థిక సహాయ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక్కటే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పార్టీ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పేరుతో క్యాన్సర్ హాస్పటల్ నిర్వహిస్తూ లాభాపేక్ష లేకుండా వేల మందికి వైద్య చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. నారా భువనేశ్వరి గారు ఎన్టీఆర్ పేరుతో పాఠశాలలు నిర్వహిస్తూ వేలాది మంది విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నారని చెప్పారు.

ఈ విధంగా తెలుగుదేశం పార్టీ రాజకీయాలతో పాటుగా సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుందని చెప్పారు. అందువల్లనే ఇన్ని సంవత్సరాలు అయినా పార్టీ ప్రజల్లో సుస్థిరంగా ఉంటూ ఎన్నికల్లో విజయాలను సాధిస్తోందని చెప్పారు. 2027 సంవత్సరం లోపుగా అమరావతితో పాటు పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి అవుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పారని అన్నారు. ఈ రెండు పూర్తి అయితే ఆంధ్ర ప్రదేశ్ సస్యశ్యామలంగా మారుతుందని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ శాలివాహన సంక్షేమ అభివృద్ధి సంఘం చైర్మన్ పేరేపి ఈశ్వర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దానితో పాటుగా ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా మట్టి కుండలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ అని, కోటి మంది సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. బీసీలకు సముచిత కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనిని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పార్టీని మరింతగా ముందుకు తీసుకు వెళ్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నూతి శ్రీను, ముమ్మనేని ప్రసాద్, గద్దెప్రసాద్, శొంఠి నాగేశ్వర రావు, ధూళిపాళ్ల రాజేష్, దూళిపాళ కిషోర్, భానురావూరి రమేష్ , చిన్ని, శ్రీను తిరుమలశెట్టి నాని, రామాయణపు కోటి, మాదిరెడ్డి రవి, గుండు శ్రీను, కొర్రపాటి శ్రీను, గన్నే రవి, మానస తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply