టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఉయ్యురు, ఆంధ్రప్రభ : పేద బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉయ్యూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జంపాన గుర్నాథరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జండా ఎగురవేసి, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు పేదవానికి కూడు, గూడు,గుడ్డ అందాలనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందని, పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి దేశంలోనే చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, 44 సంవత్సరాలుగా పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా జండా వదలకుండా పోరాటాలు చేసిన కార్యకర్తలకు 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని రాజేంద్రప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు వల్లభనేని సత్యనారాయణ, జంపాన పూర్ణచంద్రరావు, అబ్దుల్ కుద్దూస్, తెదేపా సగర సాధికార రాష్ట్ర కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్, కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కూనప రెడ్డి వాసు, విష్ణాలయం చైర్మన్ భాస్కర్, తెలుగుదేశం పార్టీ నాయకులు చిరంజీవి, శేఖర్, నజీర్, కుటుంబరావు , నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
