AP | నిత్య అన్నదాన పథకానికి లక్ష రూపాయలు విరాళం..

AP | నిత్య అన్నదాన పథకానికి లక్ష రూపాయలు విరాళం..

AP | ఇంద్రకీలాద్రి ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతిరోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి ఒక భక్తుడు లక్ష రూపాయల విరాళాన్ని శనివారం అందజేశారు. నగరంలోని లబ్బీపేట ప్రాంతానికి చెందిన దేవినేని రామకృష్ణ, కనకదుర్గాంబ దంపతులు రూ. 1,11,116/- విరాళాన్ని సమర్పించారు. ఈ విరాళాన్ని ఆలయంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి వినియోగించాలని కోరుతూ, దంపతులు ఈ మొత్తాన్ని ప్రోటోకాల్ సూపర్నెంట్ జగదీష్ ను కలిసి అందజేశారు. వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయగా వేద ఆశీర్వచనం అనంతరం అధికారులు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు రసీదు అందజేశారు.

Leave a Reply