పూర్వ వైభవం తీసుకువస్తాం..

పూర్వ వైభవం తీసుకువస్తాం..
ఆధునిక ఫంక్షన్ హాలుగా మచిలీపట్నం టౌన్
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం టౌన్ హాలును ఆధునీకరించి పూర్వ వైభవం తీసుకువస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శిథిలావస్థకు చేరిన టౌన్ హాలును శనివారం ఆయన పరిశీలించారు. ఆధునిక ఫంక్షన్ హాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండోమెంట్ అధికారులు తయారు చేసిన డిజైన్లను పరిశీలించిన ఆయన పలు సూచనలు చేశారు. ఆధునీకరణ పనులను త్వరితగతిన ప్రారంభించి సకల సదుపాయాలతో కూడిన టౌన్ హాలును నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి వెంట టీడీపీ నగర అధ్యక్షులు లోగిశెట్టి స్వామి, ఎండోమెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ పి రాధిక, ఈఓ సమ్మెట ఆంజనేయస్వామి తదితరులు ఉన్నారు.
