AP | వల్లభనేని వంశీపై మరో కేసు

విజయవాడ: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. ఆయన గన్నవరంలో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని మైనింగ్ ఏడీ గన్నవరం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి అక్రమ తవ్వకాలపై నివేదికను పోలీసులకు సమర్పించారు.

2019 నుంచి 2024 వరకు వంశీ, ఆయన అనుచరులు చేసిన అక్రమాల వివరాలు అందులో ఉన్నాయి. సుమారు రూ.100 కోట్ల విలువైన మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది. ఇప్పటికే ఆయన వివిధ కేసుల్లో అరెస్టై జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

Leave a Reply