ANDHRA PRABHA | నిజాలను నిర్భయంగా రాసే దమ్మున్న ఏకైక పత్రిక “ఆంధ్రప్రభ”

ANDHRA PRABHA | నిజాలను నిర్భయంగా రాసే దమ్మున్న ఏకైక పత్రిక “ఆంధ్రప్రభ”

  • ఆంధ్రప్రభ దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎస్ఐ రాజేష్…

నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో ఇవాళ‌ స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ రాజేష్ చేతుల మీదుగా ఆంధ్రప్రభ దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… 88సంవత్సరాలుగా పత్రికా రంగంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఎన్నో సమస్యల పరిష్కారానికి కేంద్ర బిందువుగా ఆంధ్రప్రభ దినపత్రిక మారిందన్నారు.

ఆంధ్రప్రభలో పలు శీర్షికలు చదవడానికి ఎంతో ఆసక్తిక‌రంగా ఉంటాయని, ఆంధ్రప్రభ దినపత్రికతో పాటు స్మార్ట్ ఎడిషన్, యూట్యూబ్ ఛానల్, వెబ్ న్యూస్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారని తెలిపారు. నిజాలను నిర్భయంగా రాసి ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న ఆంధ్రప్రభ దినపత్రిక దినదినాభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సునీత, మురళీధర్ గౌడ్, సుధాకర్, రైటర్ రాజు, కానిస్టేబుల్ అశోక్, హరీష్, దయానంద్, ఏగొండ, రమేష్, నిజాంపేట మండల ఆంధ్రప్రభ రిపోర్టర్ చంద్రకాంత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply