ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు
- అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ సమీక్ష
ఆంధ్రపభ ప్రతినిధి, భూపాలపల్లి : భూపాలపల్లి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా పై అధికారులు ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. ఇసుక ట్రాక్టర్‌తో పట్టుబడితే రూ.25వేల ఫైన్ విధించాలన్నారు. కలెక్టరేట్ కలెక్టర్, ఎస్పీ, రెవెన్యూ, పోలీసు, పీఆర్ అధికారులతో సమీక్షా నిర్వహించారు. నియోజకవర్గంలో అక్రమ ఇసుక దందాను అరికట్టేందుకు అన్ని శాఖలు సమష్టిగా కృషి చేయాలన్నారు. పూర్తి అయిన పనులకు అనుమతులు ఇవ్వొద్దన్నారు. మూడు మండలాలకు బ్లాక్ ల వారీగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఏర్పాటు చేయాలన్నారు. వాగులో అవసరం మేరకే ఇసుక తీయాలన్నారు. విధుల్లో అలసత్వం వహించవద్దని సూచించారు. కార్యక్రమంలో జిల్లా, అన్ని మండలాల అధికారులు పాల్గొన్నారు.

