Allahabad | కాలిపోయిన నోట్ల కట్టల కేసు..

Allahabad | కాలిపోయిన నోట్ల కట్టల కేసు..
Allahabad | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. గతంలో ఆయన నివాసంలో నోట్ల కట్టలు బయటపడిన ఘటన ఈ నిర్ణయానికి కారణమైందని భావిస్తున్నారు.
అలహాబాద్ హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపినట్లు సమాచారం.
గతంలో ఢిల్లీలోని ఆయన నివాసంలో అగ్నిప్రమాదం సంభవించిన సందర్భంగా నోట్ల కట్టలు బయటపడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో ఆయనపై వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే రాజీనామా వెనుక పూర్తి కారణాలు అధికారికంగా వెల్లడికాలేదు. ఈ పరిణామం న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
