ఉద్యోగాలు పోతాయనే అపోహ మాత్రమే
నైపుణ్యం పెంచుకుంటే తిరుగులేని అధిపత్యం
కొత్త సాంకేతికకు అన్ని దేశాలు ప్రొత్సా హించాలి
ఫ్రాన్స్ ఎఐ సమ్మిట్ ప్రధాని మోడీ ఉద్ఘాటన ..
పారిస్: కృత్రిమ మేధా(ఏఐ) వల్ల ఉద్యోగాలు పోతాయనే భయాలు విడనాడాలని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చారు.. భయం వీడితేనే మనం మరింత ముందుకు వెళ్లగళమని చెప్పారు.. ఫ్రాన్స్‌లో నేడు జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్‌లో ప్రధాని మాట్లాడుతూ, ఏఐ సాంకేతికత అభివృద్ధి చెందుతున్న స్వభావాన్ని , దాని బహుళ ప్రయోజనాలను పొందేందుకు జాతీయ ప్రభుత్వాల సమిష్టి గా పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజాస్వామ్యీకరించడం , అటువంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అవసరమని పేర్కొన్నారు..
ఏఐ పరిజ్ఞానంతో వచ్చే వ్యత్యాసంపై జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. “ఏఐ వల్ల మనం చేసే అన్ని పనుల్లో మార్పులు వస్తాయి. సాంకేతికత వల్ల ఉద్యోగాలు పోతాయనేది వదంతే. ఉద్యోగాల్లో నైపుణ్యం పెంచుకునే వారికే ఉన్నతావకాశాలుంటాయి. డిజిటల్ మార్కెట్, వాణిజ్యం దిశగా భారత్ ముందకెళ్తుందని అన్నారు. ఎఐ అపూర్వమైన స్థాయిలో, వేగంతో అభివృద్ధి చెందుతోందన్నారు. కొత్త ఆవిష్కరణను ప్రోత్సహించడం వల్ల ప్రపంచం మరిన్ని ప్రయోజనాల పొందుతుందని అభిప్రాయపడ్డారు.. అందుకు కొత్త సాంకేతికకు అన్ని దేశాలు సరైన ప్రొత్సాహం ఇవ్వాలని పిలుపు ఇచ్చారు…