Adilabad | కేంద్ర స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా…

Adilabad | కేంద్ర స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా…

  • పెందూర్ ప్రభాకర్

Adilabad | ఉట్నూర్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) ఉట్నూర్ పట్టణానికి చెందిన జిల్లా ప్రముఖ సీనియర్ న్యాయవాది పెందూర్ ప్రభాకర్ నియామ‌క‌మ‌య్యారు. కేంద్ర ప్రభుత్వ న్యాయ వ్యవహారాలు, సాధికారిక శాఖ ద్వారా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని నియామకమైన కౌన్సిల్ సభ్యులు పేందూర్ ప్రభాకర్ తెలిపారు.

గతంలో తనకుసీ.జి.ఎస్. సీ సభ్యుడిగా మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్(Ministry of Home Affairs)లో అవకాశం కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. ఆయనకు కేంద్రం స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా నియమించడం పట్ల తోటి న్యాయవాదులు, మిత్రులు, హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply