Accident | కారు-లారీ ఢీ.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

సీకే దిన్నె, (కడప జిల్లా), ఆంధ్రప్రభ : రాయచోటి- కడప రహదారిలో శనివారం మరో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అయిదుగురు అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. కడప గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ఈ ఘోర దుర్ఘటన శనివారం చోటు చేసుకుంది. ఘాట్ రోడ్డులో వెళ్తున్న కారుపై ఓ లారీ పడిపోయింది. దాంతో కారులో ప్రయాణిస్తున్న అయిదుగురు మృతిచెందారు. గువ్వల చెరువు ఘాట్‌లోని నాలుగో మలుపు వద్ద భా రీ గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపు తప్పి ఒక్కసారిగా కారుపై ఒరిగి పోవటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పెద్ద శబ్ధంతో ప్రమాదం జరగడంతో స్థానికులు గమనించి వాహనాల వద్దకు పరుగులు తీశారు. పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో చిక్కుకుకున్న బాధితులకు బయలకు తీసేందుఉ అగ్నిమాపక సిబ్బంది. పోలీసులు, స్థానికులు శ్రమించారు. బద్వేలు మండలం చింత పుట్టయ్య పల్లిలో ఆదివారం జరిగే జాతరలో పాల్గొనేందుకు ఏడుగురు కుటుంబ సభ్యులు బెంగళూరులో బయలుదేరారు. ప్రమాద స్థలిలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. రాయచోటి ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు వదిలారు. ఈ దుర్ఘటనలో చింత పుట్టయ్యపల్లి బసినేని శ్రీకాంత్ రెడ్డి, భార్య శిరీష , సమీప బంధువులు మేకవానిపల్లి గ్రామానికి చెందిన స్వర్ణ , గంగిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన శశి , వీరిబిడ్డలు పిల్లలు హర్షిణి, రిషి మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్టు పోలీసులు గుర్తించారు.

మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి..

కడప జిల్లా సీకే దిన్నె మండల గువ్వలచెరువు ఘాట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు దుర్మరణం చెందడంపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రాయచోటి నుంచి కడపకు కారులో వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరం అన్నారు. ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మహిళలు మరణించడం కలచివేసింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ ఘటన బాధాకరం: మంత్రి రాంప్రసాద్

కడప జిల్లా గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో లారీ, కారు ఢీకొన్న ఘటన బాధాకరమని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అయిదుగురి మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. రోడ్డు ప్రమాదాలు తీరని విషాదాన్ని నింపుతున్నాయని.. ప్రయాణికుల రోడ్డు భద్రత నియమాలు విధిగా పాటించాలని అన్నారు. రోడ్డు ప్రయాణాలలో భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

విచారం వ్య‌క్తంచేసిన మంత్రి సవిత

కడప జిల్లాలో జరిగిన ప్రమాదంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో నలుగురు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాదంపై ఎస్పీ అశోక్ కుమార్‌తో మంత్రి ఫోన్‌లో మాట్డారు. దుర్ఘటనపై ఆరా తీశారు. మృతులను గుర్తించి బాధిత కుటుంబాలకు సత్వర సమాచారం ఇవ్వాలని.. ఎస్పీ అశోక్ కుమార్‌కు మంత్రి సవిత ఆదేశించారు.అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి ఓ కుంటుబం కారులో కడపకు బయలుదేరింది. ఇదే మార్గంలో రామాపురం దాటిన తరువాత ప్రమాదకరమైన గువ్వలచెరువు ఘాట్ ప్రారంభం అవుతుంది. ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా, వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది.ఘాట్ రోడ్డులో ఒక పక్కన ఉన్న గోడవైపు కారు దూసుకుని పోయింది. లారీ కూడా కారుపై పడిపోయింది. దీంతో కారు నుజ్జునుజ్జుగా నలిగిపోయింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కల్పోయారని సమాచారం. లారీ కింద నలిగిపోయిన కారును, అందులోని మృతదేహాలను వెలికి తీయడానికి వాహనాల్లో వెళుతున్న వారితో పాటు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని ఘాట్ రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంతో భారీగా వాహనాలు నిలియిపోయాయి. లారీ కింద నలిగిన కారులో నాలుగేళ్ల పాప మృత్యుంజయురాలిగా ఉండడం గమనించిన ప్రయాణికుల సహకారంతో ఆ పాపను వెంటనే కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం అందింది.

Leave a Reply